ప్రామాణిక అనువర్తన లైసెన్స్ నిబంధనలు
MICROSOFT స్టోర్, WINDOWS స్టోర్ మరియు XBOX స్టోర్
అక్టోబర్ 2017లో నవీకరించబడింది

ఈ లైసెన్స్ నిబంధనలు మీకు మరియు అనువర్తన ప్రచురణకర్తకు మధ్య ఒప్పందం వలె పరిగణించబడతాయి. దయచేసి వీటిని చదవండి. Microsoft స్టోర్, Windows స్టోర్ లేదా Xbox స్టోర్ (ఈ లైసెన్స్ నిబంధనల్లో వీటిలో ప్రతిదీ “స్టోర్” అని పిలువబడుతుంది) నుండి మీరు డౌన్‌లోడ్ చేసుకునే సాఫ్ట్‌వేర్ అనువర్తనాలతో పాటు అనువర్తనాల యొక్క నవీకరణలు లేదా అనుబంధ అంశాలకు ఇవి వర్తిస్తాయి, కానీ అనువర్తనాలతో పాటు ప్రత్యేక నిబంధనలు అందించబడినట్లయితే ఆ నిబంధనలు వర్తిస్తాయి.

అనువర్తనాన్ని డౌన్‌లోడ్ చేయడం లేదా ఉపయోగించడం లేదా వీటిలో ఏదైనా చేయడానికి ప్రయత్నించడం ద్వారా మీరు ఈ నిబంధనలకు అంగీకరిస్తున్నట్లు పరిగణించబడుతుంది. మీరు వీటికి అంగీకరించకుంటే, మీకు ఏ హక్కూ ఉండదు మరియు మీరు అనువర్తనాన్ని డౌన్‌లోడ్ చేయకూడదు లేదా ఉపయోగించకూడదు.

అనువర్తన ప్రచురణకర్త అంటే మీకు అనువర్తనాన్న అందించే వారు, వీరి గురించి స్టోర్‌లో పేర్కొనబడుతుంది.

మీరు ఈ లైసెన్స్ నిబంధనలకు అంగీకరించినట్లయితే, మీకు దిగువ హక్కులు లభిస్తాయి.
1. ఇన్‌స్టాలేషన్ మరియు ఉపయోగ హక్కులు; గడువు ముగింపు. మా ఉపయోగ నియమాలలో పేర్కొనబడిన విధంగా మీరు Windows పరికరాలు లేదా Xbox కన్సోల్‌లలో అనువర్తనాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు మరియు ఉపయోగించవచ్చు. ఏ సమయంలో అయినా మా ఉపయోగ నియమాలను సవరించగల హక్కు Microsoft హక్కు కలిగి ఉంది.
2. ఇంటర్నెట్ ఆధారిత సేవలు.

a. ఇంటర్నెట్ ఆధారిత లేదా వైర్‌లెస్ సేవలకు సమ్మతి. అనువర్తనం కనుక వైర్‌లెస్ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్‌తో కంప్యూటర్ సిస్టమ్‌లకు అనుసంధానం అయితే, మీరు అనువర్తనాన్ని ఉపయోగించినట్లయితే ఇంటర్నెట్ ఆధారిత లేదా వైర్‌లెస్ సేవల కోసం ప్రామాణిక పరికర సమాచారాన్ని (మీ పరికరం, సిస్టమ్ మరియు అనువర్తన సాఫ్ట్‌వేర్ మరియు అనుబంధ అంశాలతో పాటు మిగిలిన సమాచారం) బదిలీ చేయడానికి మీరు సమ్మతిస్తున్నట్లు పరిగణించబడుతుంది. అనువర్తనాన్ని ఉపయోగించే సమయంలో మీరు సేవలను ప్రాప్యత చేయడానికి సంబంధించి ఇతర నిబంధనలు అందుబాటులో ఉన్నట్లయితే, ఆ నిబంధనలు కూడా వర్తిస్తాయి.

b. ఇంటర్నెట్ ఆధారిత సేవల దుర్వినియోగం. మీరు ఇంటర్నెట్ ఆధారిత సేవని ఉపయోగించే సమయంలో దీనిని లేదా వైర్‌లెస్ నెట్‌వర్క్‌ని ఇతరులు ఉపయోగించే సమయంలో దీనికి లేదా వారి ఉపయోగానికి హాని కలిగించే విధంగా ప్రవర్తించకూడదు. ఏ రకంగా అయినా కూడా ఏదైనా సేవ, డేటా, ఖాతా లేదా నెట్‌వర్క్ యొక్క ప్రాప్యతను అప్రమాణిక పద్ధతిలో పొందడం కోసం మీరు సేవని ఉపయోగించకూడదు.

3. లైసెన్స్ పరిధి. అనువర్తనం యొక్క లైసెన్స్ అందించబడుతుంది, ఇది విక్రయించబడదు. అనువర్తనాన్ని ఉపయోగించడం కోసం కొన్ని హక్కులను మాత్రమే ఈ ఒప్పందం మీకు అందిస్తుంది. మీ పరికరంలో అనువర్తనాలను ఉపయోగించగల సామర్థ్యాన్ని Microsoft నిలిపివేసినట్లయితే, Microsoftతో మీ ఒప్పందం మరియు అనుబంధ లైసెన్స్ హక్కులు రద్దు చేయబడతాయి. అనువర్తన ప్రచురణకర్తనకు మాత్రమే అన్ని ఇతర హక్కులు ఉంటాయి. వర్తించే చట్టం ఈ పరిమితిని మించి మీకు అధిక హక్కులు అందించినప్పుడు మినహా, ఈ ఒప్పందంలో పేర్కొన్న పరిమితిలోపు మాత్రమే మీరు అనువర్తనాన్ని ఉపయోగించవచ్చు. అందుకోసం, నిర్దిష్ట మార్గాలలో మాత్రమే అనువర్తనాన్ని ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతించే విధంగా అందులో ఉన్న సాంకేతికత పరిమితులకు మీరు తప్పక కట్టుబడి ఉండాలి. మీరు వీటిని చేయలేకపోవచ్చు:

a. అనువర్తనంలో ఉన్న సాంకేతిక పరిమితులను మార్చడం.

b. ఈ పరిమితిని మించి వర్తించే చట్టం మిమ్మల్ని అనుమతించిన పరిధి మినహా, మీరు అనువర్తనం సాంకేతికతను మార్చడం, డీకంపైల్ చేయడం లేదా డిసెంబుల్ చేయడం.

c. ఈ పరిమితి మినహా, ఈ ఒప్పందంలో పేర్కొనబడిన లేదా వర్తించే చట్టం అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ అనువర్తన కాపీలను రూపొందించడం.

d. అనువర్తనం యొక్క కాపీని ప్రచురించడం లేదా ఇతరులకు అందుబాటులో ఉంచడం.

e. అనువర్తనాన్ని అద్దెకు ఇవ్వడం, లీజుకి ఇవ్వడం లేదా అరువుగా ఇవ్వడం.

f. అనువర్తనాన్ని లేదా ఈ ఒప్పందాన్ని ఏదైనా మూడవ పక్షానికి బదిలీ చేయడం.
4. ప్రమాణ పత్రాలు. అనువర్తనంతో పాటు ప్రమాణ పత్రాలను అందించినట్లయితే, వ్యక్తిగత సూచన అవసరాల కోసం మీరు ప్రమాణ పత్రాలను కాపీ చేయవచ్చు మరియు ఉపయోగించవచ్చు.
5. సాంకేతికత మరియు ఎగుమతి నియంత్రణలు. యునైటెడ్ స్టేట్స్ లేదా అంతర్జాతీయ సాంకేతికత నియంత్రణ లేదా ఎగుమతి చట్టాలు మరియు నియంత్రణలకు అనువర్తనం కట్టుబడి ఉండవచ్చు. అనువర్తనం ఉపయోగించిన లేదా మద్దతిచ్చిన సాంకేతికతకు సంబంధించిన అన్ని జాతీయ మరియు అంతర్జాతీయ ఎగుమతి చట్టాలు మరియ నియంత్రణలకు మీరు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి. ఈ చట్టాలలో గమ్యస్థానాలు, తుది వినియోగదారులు మరియు తుది ఉపయోగంపై నియంత్రణలు ఉంటాయి. Microsoft బ్రాండెడ్ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం కావాలంటే, Microsoft ఎగుమతి వెబ్‌సైట్ (http://go.microsoft.com/fwlink/?LinkId=242130)కి వెళ్లండి.
6. మద్దతు ఉన్న సేవలు. ఏవైనా మద్దతు సేవలు అందుబాటులో ఉన్నాయేమో నిర్ధారించడం కోసం అనువర్తన ప్రచురణకర్తను సంప్రదించండి. అనువర్తనం యొక్క మద్దతు సేవలను అందించడానికి Microsoft, మీ హార్డ్‌వేర్ తయారీదారు మరియు మీ వైర్‌లెస్ క్యారియర్ (వారిలో ఎవరైనా అనువర్తన ప్రచురణకర్త అయినప్పుడు మినహా) బాధ్యత వహించరు.
7. సంపూర్ణ ఒప్పందం. మీకు మరియు అనువర్తనానికి సంబంధించిన అనువర్తన ప్రచురణకర్తకు మధ్య ఈ ఒప్పందం, ఏదైనా వర్తించే గోప్యతా విధానం, అనువర్తనానికి సంబంధించిన ఏవైనా అదనపు నిబంధనలు మరియు అనుబంధ అంశాల యొక్క నిబంధనలు మరియు నవీకరణలు ఒక సంపూర్ణ లైసెన్స్ ఒప్పందం వలె పరిగణించబడతాయి.
8. వర్తించే చట్టం.

a. యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా. మీరు యునైటెడ్ స్టేట్స్ లేదా కెనడాలో అనువర్తనాన్ని పొంది ఉంటే, చట్టంలోని వైరుధ్యాలతో సంబంధం లేకుండా, ఈ నిబంధనల అమలు, వాటి ఉల్లంఘనకు సంబంధించిన దావాలు మరియు అన్ని ఇతర దావాలను మీరు నివసించే (లేదా వ్యాపారం అయితే, మీ వ్యాపారం యొక్క ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతం) యొక్క చట్టాలకు పర్యవేక్షిస్తాయి.

b. యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా వెలుపల. మీరు ఏదైనా ఇతర దేశంలో అనువర్తనాన్ని పొందినట్లయితే, ఆ దేశం యొక్క చట్టాలు వర్తిస్తాయి.
9. చట్టపరమైన ప్రభావం. నిర్దిష్ట చట్టపరమైన హక్కులు ఈ ఒప్పందంలో వివరించబడ్డాయి. మీ రాష్ట్రం లేదా దేశంలోని చట్టాల ప్రకారం మీకు ఇతర హక్కులు లభించవచ్చు. మీ రాష్ట్రం లేదా దేశంలోని చట్టాలు అనుమతించకుంటే, మీ రాష్ట్రం లేదా దేశంలోని చట్టాల ప్రకారం మీకు లభించిన హక్కులపై ఈ ఒప్పందం ప్రభావం చూపదు.
10. వారెంటీ నిరాకరణ. “యథావిధిగా”, “అన్ని లోపాలతో” మరియు “అందుబాటులో ఉన్న విధంగా” ఉపయోగించడం కోసం అనువర్తనం యొక్క లైసెన్స్ అందించబడుతుంది. దీని ఉపయోగానికి సంబంధించిన అన్ని సమస్యలను మీరే పరిష్కరించుకోవాలి. అనువర్తన ప్రచురణకర్త తమ స్వంతంగా, Microsoft (అనువర్తన ప్రచురణకర్త Microsoft కాకుంటే), అనువర్తనాన్ని అందించడానికి ఉపయోగించిన నెట్‌వర్క్ యొక్క వైర్‌లెస్ క్యారియర్‌లు మరియు సంబంధిత అనుబంధ సంస్థలు, విక్రేతలు, ఏజెంట్‌లు, సరఫరాదారులలో ఎవరూ కూడా అనువర్తనానికి సంబంధించి వారెంటీలు, గ్యారంటీలు లేదా ఇతర షరతులు అందించరు. అనువర్తనం యొక్క నాణ్యత, భద్రత, సౌలభ్యం మరియు పనితీరుకి సంబంధించిన పూర్తి బాధ్యత మీరే వహించాలి. అనువర్తనంలో లోపాలు ఉన్నట్లయితే, బాగు చేయడం లేదా మరమ్మతు చేయడానికి అవసరమైన మొత్తం ఖర్చులు మీరే భరించాలి. ఈ స్థానిక చట్టాల ప్రకారం మీరు అదనపు వినియోగదారు హక్కులు లభించవచ్చు, వాటిపై ఈ ఒప్పందం ప్రభావం చూపదు. మీ స్థానిక చట్టాలు అనుమతించిన పరిమితి మేరకు, వర్తకయోగ్యత, నిర్దిష్ట అవసరానికి తగ్గట్లు ఉండటం, భద్రత, సౌలభ్యం మరియు ఉల్లంఘన-రహితంగా ఉండటానికి సంబంధించిన వాటితో సహా అన్ని ప్రత్యక్ష వారెంటీలు లేదా షరతులను సంబంధిత పక్షాలు మినహాయిస్తాయి.
11. నివారణ చర్యలు మరియు నష్టాల పరిమితి మరియు మినహాయింపు. చట్టం అనుమతించిన పరిమితి మేరకు, ఏవైనా నష్టాలకు సంబంధించిన పరిహారాన్ని పొందడానికి మీ వద్ద సరైన కారణం ఉన్నట్లయితే, అనువర్తన ప్రచురణకర్తకు మీరు అనువర్తనం కోసం చెల్లించిన మొత్తానికి సమానమైన నగదు లేదా USD$1.00 రెండింటిలో ఏది ఎక్కువైతే అంత పరిహారంగా పొందవచ్చు. పరిణామపూర్వక హానులు, లాభాలలో నష్టాలు, ప్రత్యేక, పరోక్ష లేదా సంఘటనాత్మక హానులతో సహా ఏవైనా ఇతర నష్టాలకు సంబంధించి అనువర్తన ప్రచురణకర్త నుండి పరిహారాన్ని పొందగల హక్కుని మీరు వదులుకోవలసిన అవసరం లేదు. ఈ నిబంధనలలో లేకపోయినా కూడా, మీ స్థానిక చట్టాలు కనుక ఏదైనా వారెంటీ, గ్యారంటీ లేదా షరతుని విధించినట్లయితే, మీరు అనువర్తనాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నప్పటి నుండి గరిష్టంగా 90 రోజుల వరకు ఇది వర్తిస్తుంది.

ఈ పరిమితి వీటికి వర్తిస్తుంది:
అనువర్తనం ద్వారా అందుబాటులో ఉంచిన అనువర్తనం లేదా సేవలకు సంబంధించిన అన్నింటికీ; మరియు
ఒప్పందం, వారెంటీ, గ్యారంటీ లేదా షరతుల ఉల్లంఘన యొక్క దావా; ఖచ్చితమైన కర్తవ్యం, నిర్లక్ష్యం లేదా ఇతర అపరాధం; శాసనం లేదా నియంత్రణ యొక్క ఉల్లంఘన; అన్యాయమైన ప్రగతి; లేదా ఏదైనా ఇతర సిద్ధాంతం; అన్ని కూడా వర్తించే చట్టం యొక్క పరిధిలోనే ఉండాలి.

ఇది వీటికి కూడా వర్తిస్తుంది:
ఈ పరిహారం కారణంగా మీ నష్టాలు పూర్తిగా భర్తీ కాకపోవచ్చు; లేదా
అనువర్తన ప్రచురణకర్తకు నష్టాల సంభావ్యత గురించి తెలిసి ఉండాలి లేదా తెలియజేసి ఉండాలి.